లవ్ ఫెయిల్యూర్​తో ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్య

లవ్ ఫెయిల్యూర్​తో ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్య
  •     గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: లవ్ ఫెయిల్యూర్​తో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బాతులూరు గ్రామానికి చెందిన గజ్జల నాగశేషులు కొడుకు నాగచక్రపాణి(28) గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్టల్​లో ఉంటున్నాడు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్​వేర్ జాబ్ చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే ఓ యువతిని చక్రపాణి ప్రేమించాడు. 

బుధవారం నాగచక్రపాణి తాను ఉంటున్న హాస్టల్ రూమ్​లో ఫ్యాన్​కు బెడ్ షీట్​తో ఉరేసుకున్నాడు. రూమ్ మేట్స్ గమనించి వెంటనే గచ్చిబౌలి పోలీసులకు, నాగచక్రపాణి తండ్రికి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్​బాడీని ఉస్మానియాకు తరలించారు. అతడి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు తెలిపారు. నాగశేషులు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..

జీడిమెట్ల: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన శరత్ పాండే(26) బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి సూరారం కాలనీలో ఉంటూ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీలో వాచ్​మన్​గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో  ఇబ్బంది పడుతున్న శరత్.. డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం అర్ధరాత్రి శరత్ ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.