వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఐటీ ఇంట్రెస్ట్

వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఐటీ ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగు కరోనా ఎఫెక్ట్​తో ఐటీ ఇండస్ట్రీకి షాక్ తగలగా, ఖర్చులు తగ్గించుకుని నష్టాలు పూడ్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. థర్డ్ ఫేజ్​లో 33 శాతం ఉద్యోగులతో ఆఫీసులు రన్ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. 60శాతం కంపెనీలు ఎంప్లాయీస్​తో వర్క్ ఫ్రమ్​ హోమ్​ కంటిన్యూ చేయిస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినా కొంతకాలం ఇదే పద్ధతి కొనసాగే అవకాశముందని ఐటీ ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.

అలా ఎందుకంటే…

గ్రేటర్​ ​హైదరాబాద్​లో స్మాల్, మీడియం, మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలు10 వేలకి పైనే ఉంటాయి. వాటిల్లో 6 లక్షల మంది టెకీలు వర్క్ చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి తక్కువ హ్యుమన్ రిసోర్స్​తో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఐటీ కంపెనీలు రన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయినా, అదనపు ఖర్చుగా భావిస్తున్న కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్​ హోమ్ బాటలోనే నడుస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఎంప్లాయీస్​కి ఫ్రీ ట్రాన్స్​పోర్ట్, అకామిడేషన్, ఫుడ్, క్యాంటీన్ ఫెసిలిటీస్ కల్పిస్తాయి. రిఫ్రెష్ మెంట్ యాక్టివిటీలో భాగంగా వీకెండ్ పార్టీలు, మంత్లీ టూర్లు కండక్ట్ చేస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్​తో ఆఫీస్​ మెయింటెనెన్స్ తోపాటు ఇప్పుడు ఆ అదనపు ఖర్చులన్నీ తగ్గిపోయాయని గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు.

ప్రొడక్షన్​కి నో ప్రాబ్లమ్

వర్క్ ఫ్రమ్ హోమ్​ చేస్తున్నా ప్రొడక్షన్​లో మార్పు లేదని ఓ ఐటీ కంపెనీ టీమ్​ లీడర్ అభిలాష్ తెలిపారు. తన టీమ్​లో 25 మందికి ఆన్ లైన్ వీడియో కాలింగ్ ద్వారాసజెషన్స్ ఇస్తూ వర్క్ చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వర్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ బేస్డ్ సర్వర్ ప్లాట్​ఫామ్​పై పనిచేసే సిబ్బందికి కూడా కంపెనీలు డెస్క్ టాప్​లు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్​ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంట్లోనే బెటర్  

ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్​కు ఇంట్రెస్ట్ ​చూపుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్​లో ఇరుక్కుని ఆఫీసుకు వెళ్లడం కంటే ఇది బెస్ట్​ అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా కంపెనీలు ఈ సిస్టమ్ ​కంటిన్యూ చేసే అవకాశం ఉందని యూఎస్ క్లయింట్ బేస్డ్ కంపెనీకి చెందిన టెకీ మధుకర్ చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల రోజులో ఓ గంట ఎక్కువగా పనిచేసే వీలుంటుందని, కంపెనీలకు ప్రొడక్షన్ వాల్యూ కలిసి వస్తోందని తెలిపారు.

వర్కింగ్​ అవర్స్​ పెరగొచ్చు

పెద్ద కంపెనీలు 75శాతం ఎంప్లాయీస్​తో వర్క్ ఫ్రమ్ హోమ్​ చేయిస్తున్నాయి. రిసోర్సెస్ అంతా ఇంటి వద్దే   పని చేస్తున్నా ప్రొడక్షన్​కి నష్టం లేదు. కాకపోతే,  వర్కింగ్​ అవర్స్​ పెరిగే అవకాశం కొంత ఉండొచ్చు.  లాక్ డౌన్ ఎత్తేసినా వర్క్ ఫ్రమ్ హోమ్​ కంటిన్యూ అయ్యేట్టు కనిపిస్తోంది.

‑ సంతోష్ కుమార్, విప్రో హెచ్ఆర్ మేనేజర్

జూన్​ 7వరకు ఇలాగే

లాక్ డౌన్ స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ​చేస్తున్నా.  మొదట్లో సొంత ల్యాప్​టాప్​తోనే వర్క్​చేసినా, 15 రోజుల కిందట కంపెనీ నుంచి వచ్చింది. జూన్ 7 వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని మా టీమ్​ లీడర్​ చెప్పారు.

– భాను ప్రసాద్, ఐటీ ఎంప్లాయ్​

6 రోజుల్లో 1,386 రిజిస్ట్రేషన్లు