గవర్నర్ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణం

గవర్నర్ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణం

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉందన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై ను గౌరవించాల్సిందిపోయి.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం.. రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. గవర్నర్ ఉగాది వేడుకలు నిర్వహిస్తే చీఫ్ సెక్రెటరీ, డీజీపీ కూడా వెళ్లకపోవడమేంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అధికారులు సైతం రాజ్యాంగాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించడం బాధ్యతా రాహిత్యం అన్నారు. కేసీఆర్ కు బీజేపీకి మధ్య విభేదాలున్నాయని చాటుకునేందుకు రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారిని అగౌరవపరచడం ఏం పద్ధతి అని అన్నారు. కేసీఆర్ బీజేపీతో కలసి నాటకాలు ఆడుతున్నారన్న అనుమానాలున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 
మరోవైపు.. ఢిల్లీలో రాహుల్ తో భేటీపైనా ఆయన స్పందించారు. అంతా కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారని చెప్పారు. భిన్నాభిప్రాయాలున్నాయే తప్ప భేదాభిప్రాయాలు కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలను మీరు భేదాభిప్రాయాలుగా భావిస్తున్నారని అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు