వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోడీతో  భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరు నేతల సమావేశం దాదాపు 20 నిమిషాలపాటు కొనసాగింది. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను సీబీఐ కస్టడీకి తీసుకున్న మరుసటి రోజే శరద్ పవార్ మోడీతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. 
రాష్ట్రపతి ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన శరద్ పవార్.. తాజా రాజకీయపరిస్థితులపై చర్చించారు. అయితే మహారాష్ట్రకు సంబంధించిన అంశాలపైనే ప్రధాని మోడీతో చర్చించారని ఎన్సీపీ వర్గాలు సమాచారం. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ దాడులు చేసి 11.15 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేసిన విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.కేవలం వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈడీతో దాడులు చేయిస్తారా..? అని శరద్ పవార్ మోడీని ప్రశ్నించినట్లు.. ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 

ఇవి కూడా చదవండి

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

వీడియో: సాయం కోసం మెట్రో మాల్ ముందు క్యూలైన్లు