Good Work: కొలీగ్స్ ను పట్టించుకోకుంటేనే మంచిది

Good Work: కొలీగ్స్ ను పట్టించుకోకుంటేనే మంచిది


ఏ ఆఫీసు చూసినా.. కంపనీ చూసినా సరే చాలామంది వర్కర్స్​ ఉంటారు. అప్పుడు వారితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అక్కడ కొలీగ్స్ తో కబుర్లు చెప్పుకోవడం, టీ బ్రేక్ తీసుకుని బయటికి వెళ్లడం, కలిసి లంచ్ చేయడం వంటివి చాలా సహజం ఒకవేళ ఎవరైనా తోటి ఉద్యోగులతో కలిసి ఉండకపోతే వాళ్లను వింతగా చూస్తారు.. అయితే ఇలా ఎవరితో కలవకుండా. ఉన్నా తప్పుపట్టక్కర్లేదని, కొలీగ్స్ ను పట్టించుకోకుండా ఉంటేనే బాగా పని చేయగలుగుతారని తాజా అధ్యయనం వెల్లడించింది..

"సైకాలజిస్ట్ లు  జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. పని చేసేటప్పుడు పక్కన ఉండేవాళ్లను పట్టించుకోకుంటేనే మంచిదని ఆ అధ్యయనం తేల్చింది. 'ఎక్కువ పని ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకోకూడదు. కొలీగ్స్ తో మాట్లాడటం వల్ల చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు కొలీగ్స్ వల్ల పనికి ఇబ్బంది కలుగుతుంది. తిరిగి పనిమీద ఫోకస్ చేసేందుకు కనీసం ఇరవై అయిదు నిమిషాల టైమ్ పడుతుంది. ఇలా పని చేస్తూ, పక్కవాళ్లతో మాట్లాడుతూ. ఉండటం వల్ల అనవసరంగా టైమ్. ఎనర్జీ రెండూ వేస్ట్ అవుతున్నాయి. దీనిపల్ల అలసిపోతారు' అని ఈ స్టడీ వెల్లడించింది. అలాగే పని చేసేటప్పుడు హెడ్​ ఫోన్స్ వాడటం మాత్రం మంచిదే అంటున్నారు. పరిశోధకులు.  హెడ్​ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల పక్కవాళ్లు మిమ్మల్ని డిస్టర్స్ చేయలేరు.