
- ఇప్పటికే 70 చెరువుల వద్ద ఏర్పాటు
- హెచ్ఎండీఏ పరిధిలో 600 పైగా ట్యాంక్స్
- నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువుల రక్షణపై హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతీ చెరువు దగ్గర లేక్ ప్రొటెక్షన్ పేరుతో ఇద్దరు గార్డ్స్ ను పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 70 చెరువుల దగ్గర గార్డ్స్ తో నిఘా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని చెరువుల దగ్గర నిఘా పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు హైడ్రా అధికారులు.
చెరువుల దగ్గర ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించారు కమిషనర్ రంగనాథ్. గ్రేటర్ పరిధిలో 185 చెరువులు, HMDA పరిధిలో 600 లకు పైగా చెరువులు ఉన్నాయని హైడ్రా బావిస్తోంది.