ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్!

ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్!

టీం ఇండియా వరుస ఫెయిల్యూర్లని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ జట్టు ప్రక్షాళన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొదట ఇద్దరు కేప్టెన్లు, ఇద్దరు కోచ్లను నియమించి, భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్రికెట్ విశ్లేషకులు మాత్రం స్ప్లిట్ కోచ్, కేప్టెన్సీ సూత్రం టీమిండియాలో పనిచేయదని చెప్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఒక్కరిపైనే బాద్యతలు ఉంచే పనిలో పడింది. అయితే, ఈ లెక్కన బీసీసీఐ జట్టు హెడ్ కోచ్ బాద్యతలు రాహుల్ ద్రవిడ్ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ కి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

2019 అండర్ 19 వరల్డ్ కప్ లో, ఐర్లాండ్ సిరీస్ లో, 2022లో జరిగిన ఆసియా కప్ లో ద్రవిడ్ స్థానంలో హెడ్ కోచ్ బాద్యతలు తీసుకున్న లక్ష్మణ్, ఆయన తీసుకున్న నిర్ణయాలతో అందరినీ మెప్పించాడు. ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ తో కోచ్ గా ద్రవిడ్ రెండేండ్ల పదవికాలం ముగుస్తుంది. ఈ క్రమంలో ద్రవిడ్ పదవికాలాన్ని పొడగించే యోచనలో బీసీసీఐ లేదని తెలుస్తుంది. దీంతో లక్ష్మణ్ ని హెడ్ కోచ్ గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.