కేజీయఫ్‌కు మించి సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కేజీయఫ్‌కు మించి సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‘రాధేశ్యామ్’ చిత్రంలో లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించిన ప్రభాస్.. తర్వాతి చిత్రాల్లో పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరోయిజాన్ని ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించిన ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లోనూ అదే స్థాయిలో ఎలివేషన్స్, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. మే ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాలు తీయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి బొగ్గుగనులతో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసిన సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా భాగం షూటింగ్ జరిగింది. ఇదిలా ఉంటే ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య క్రాస్ ఓవర్ కనెక్షన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు యాక్షన్ హీరోలు ఒకే కాలానికి చెందిన వాళ్లన్నట్టుగా చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. 

‘కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లో ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయిన ఫర్మాన్ అనే క్యారెక్టరే.. ఆ తర్వాత సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదుగుతాడనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మెడలో ఒకే తరహా లాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించడంతో పాటు, రెండు చిత్రాల్లో ఈశ్వరీరావు తల్లిపాత్ర పోషిస్తుండడంతో రెండింటికి ముడిపెడుతున్నారు. ఏదేమైనా ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’తో ప్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియావైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీల్, ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాను అంతకుమించి ఉండేలా రూపొందిస్తున్నాడు. శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ మూవీని విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిరగందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.