- ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహదేవపూర్,వెలుగు : స్థానికంగా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మహదేవపూర్ మండలం లో ఇండస్ట్రీయల్ కంపెనీలను ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని జామా మసీదులో ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం లీడర్లు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని అన్నారు.
అనంతరం రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ముస్లిం నాయకుల సమస్యలు పరిష్కరిస్తామని, ,ఎన్నికల కోడ్ సందర్భంగా సంక్షేమ పనుల్లో ఆలస్యం జరుగుతుందని చెప్పారు. తనకు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినట్లే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.