
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాన్యూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ దాడులకు దిగింది. కంపెనీకి చెందిన కార్యాలయాలతోపాటు ప్రొడక్షన్ కేంద్రాల్లోనూ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏకకాలంలో హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇరవై బృందాలుగా విడిపోయిన అధికారులు దాడులను నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.