నల్లగొండ జిల్లాలో ఐటీ సోదాలు.. బీఆర్ ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో రైయిడ్స్

నల్లగొండ జిల్లాలో ఐటీ సోదాలు.. బీఆర్ ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో రైయిడ్స్

నల్గొండ జిల్లాలో ఐటి రైయిడ్స్ కలకలం రేపుతున్నాయి.  బీఆర్ ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో ఐటీసోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ముఖ్య అనుచరుల ఇండ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఐటి అధికారులు. 40 చోట్ల 30 టీమ్ లతో ఈ ఏకకాలంలో ఈ రైయిడ్స్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు అనుచరుడు కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ నివాసాలపైనా సోదాలు జరుగుతున్నాయి. వైదేహి టౌన్ షిప్ లో ఉన్న నివాసంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాన్ స్టాప్ గా రైయిడ్స్ నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఎన్నికల టైమ్ లో భారీగా డబ్బులు నిల్వచేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు  చేస్తున్నారు అధికారులు. 

మరోవైపు నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల ఇండ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నెహ్రూ గంజ్ లోని మహేంద్ర ఆయిల్ మిల్...ఓనర్ మహేందర్ రవీంద్ర ఇండ్లలో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు.