బెంగళూరులో రెండు రోజులు వర్షం.. సిటీ జనాలకు రిలీఫ్

బెంగళూరులో రెండు రోజులు వర్షం.. సిటీ జనాలకు రిలీఫ్

బెంగళూరు: నీటి కొరత, తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న బెంగళూరు వాసులను ఎట్టకేలకు వరుణు డు కరుణించాడు. నగరంలో శుక్ర, శనివారం వర్షం కురిసింది. ఎండలతో అల్లాడిపోతున్న నగరవా సులు.. వాతావరణం చల్లబడడంతో ఊరట చెందారు. వర్షాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్  మీడియాలో పోస్టు చేస్తున్నారు. వాన దేవుడు కరుణించాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వ్యాప్తంగా రెండో రోజు శనివారం కూడా ఉరుము లు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. 

ఇప్పటికే నగరంలో చెరువులు ఆక్రమణ కు గురై, బోర్లలో నీళ్లు ఎండిపోవ డంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్య నెలకొం ది. దీంతో ప్రభుత్వం ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తోంది. నీటి వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఎట్ట కేలకు వర్షాలు కురవడంతో నీటి ఎద్దడి కాస్తయినా తీరుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు. ఇక ఈనెల 21 నుంచి 24 వరకు కర్నాటక అంతటా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.