ఇంత టాలెంటా : అది కారే.. కాకపోతే హెలికాఫ్టర్ లా మార్చేశాడు..

ఇంత టాలెంటా : అది కారే.. కాకపోతే హెలికాఫ్టర్ లా మార్చేశాడు..

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.ఏదో ఒక సమయంలో అది బయటికి వస్తుంది. చదువు ఉన్నా .. లేకపోయినా.. తమకున్న టాలెంట్ తో కొత్త కొత్త వస్తువులను కనుగొంటారు.. అప్ గ్రేడ్ చేస్తుంటారు.. స్పెషల్ ఎడ్యుకేషన్ తో చేసే ఆవిష్కరణలు పక్కన పెడితే.. కొంతమంది వృత్తిలో నైపుణ్యంతో కొత్త వాటిని సృష్టించడం చూస్తున్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు యువకులు కారును హెలికాప్టర్ మార్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది..తమదగ్గర ఉన్న కారును ఏకంగా హెలికాప్టర్ గా మార్చేశారు ఈ ఇద్దరు యువకులు.. వారి హెలికాప్టర్ కథేంటో చూద్దాం రండి..  

ప్రియాసింగ్ అనే  వినియోగదారు X లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  కారు దాని వెనక తోకతో, దానిపైన హెలికాప్టర్ ఫ్యాన్తో కనిపిస్తుంది. యూపీలోని అంబేద్కర్ నగర్ కు చెందిన జుగాద్ సోదరులు కారును హెలికాప్టర్ గా మార్చారు. దీనిని పెయింటింగ్ వేస్తున్న క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం  వ్యక్తం చేశారు.  

ఈ వీడియో నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది. మనం ఆవిష్కరణలను ఖచ్చితంగా గౌరవించాలి.. సమాజంలోని ప్రతి అంశంలో ఆవిష్కరణలు జరుగుతున్నాయి.. వీటిని ప్రోత్సహించాలి అంటూ ఓ నెటిజన్ రాశారు. మరో నెటిజన్ ‘‘ కారును హెలికాప్టర్ గా మార్చిన ఇద్దరు యువకులను పోలీసుల అరెస్ట్ చేయడం దారుణం.. ఇది ప్రతిభను తిరస్కరించడమే.. మెచ్చుకొని బహుమతి ఇవ్వాల్సిన వారికి శిక్షలు పడుతున్నాయి. ఐఐటీ, ఇన్ స్టిట్యూట్ అప్రమత్తంగా ఉండాలి అంటూ పోస్ట్ లో రాశారు. 

అదే ఒక విదేశీయుడు అయితే ఈ వ్యక్తులకు బహుమతి లభించేది.. స్కిల్స్ ను ప్రదర్శిస్తే.. జైల్లో పెడుతున్నారు..ఇదే బాగోలేదంటున్నారు నెటిజన్లు.