ఆస్పత్రిలో చేరిన ఉపాసన.. జూన్ 20న డెలివరీ..!

ఆస్పత్రిలో చేరిన ఉపాసన.. జూన్ 20న డెలివరీ..!

కొణిదెల వారింటికి మరో కొత్త అతిథి రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడోతరం రాకకు మంగళవారం (జూన్ 20న) ముహూర్తం ఖరారు అయ్యింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు రేపు (జూన్ 20న) తమ తొలి సంతానికి స్వాగతం పలకబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రచారం నిజమేనని స్పష్టత వచ్చింది. 

మంగళవారం రోజు (జూన్ 20న) బిడ్డకు జన్మనిచ్చేందుకు ఉపాసన హాస్పిటల్‌లో చేరారు. భర్త రామ్ చరణ్, తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెలతో కలిసి సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్  అపోలో ప్రో హెల్త్ హాస్పిటల్‌‌కు ఉపాసన వెళ్లారు. ఇక్కడే మంగళవారం రోజు ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. 
మరోవైపు.. మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా..? వారసురాలు వస్తుందా..? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

https://twitter.com/MegaStarKTweets/status/1670800554979729411