ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

దళితబంధు దేశానికే ఆదర్శం
నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని నకిరేకల్‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెంబాయిలో 17 మంది లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు యూనిట్లను గురువారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని సవాల్‌‌‌‌ చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌గా మారిందని, కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ ఈడీ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొలను సునీత వెంకటేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎంపీడీవో లాజర్, సర్పంచ్‌‌‌‌ నర్సిరెడ్డి, జడ్పీటీసీ ధనమ్మ, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌‌‌‌రెడ్డి, మార్కెట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జడల ఆదిమల్లయ్య, మండల అధ్యక్షుడు ఐలయ్య పాల్గొన్నారు.


కాంగ్రెస్‌‌‌‌ లీడర్లపై కేసులు ఎత్తివేయాలి 
సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ లీడర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌ చేశారు. సూర్యాపేటలోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో గురువారం జరిగిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఎలాంటి విచారణ లేకుండా యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్‌‌‌‌ బైరు శైలేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌పై  హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్‌‌‌‌ లీడర్లను అణచివేసేందుకు అధికార పార్టీ నేతలు తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. వార్డుల్లో పెన్షన్‌‌‌‌ కార్డులను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పంచుతూ గొడవలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు చకిలం రాజా, కక్కిరేణి శ్రీనివాస్, నరేందర్‌‌‌‌నాయుడు, యేలేటి మాణిక్యం పాల్గొన్నారు.

ముందస్తు గురించి మాట్లాడడం హాస్యాస్పదం
సూర్యాపేట, వెలుగు : మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కోలేని వాళ్లు ముందస్తు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని  విద్యుత్‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన పలువురికి ఆసరా పెన్షన్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి మూడో స్థానమేనని అన్ని సర్వేల్లో తేలిందని, ఆ భయంతోనే ఉప ఎన్నిక ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలు ఎదుర్కోలేని వాళ్లు ముందస్తు గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సైనికులు, రైతులు, కూలీల ఫ్యామిలీలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌‌‌‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌, ఆర్డీవో రాజేంద్రకుమార్, పీడీ కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎంపీపీలు నెమ్మాది భిక్షం, కుమారి బాబునాయక్ పాల్గొన్నారు.

బీసీలను ఓటుబ్యాంక్‌‌‌‌గానే చూస్తున్నరు
యాదగిరిగుట్ట, వెలుగు : అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటుబ్యాంక్‌‌‌‌గానే చూస్తున్నారు తప్ప చట్ట సభల్లో ప్రయారిటీ ఇవ్వడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను చైతన్యపర్చడం కోసం బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ యాత్రను ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగుస్తుందని, ఈ సందర్భంగా లక్ష మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండు జ్యోతి, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు లంకలపల్లి వెంకటరత్నంచారి, గుట్ట పట్టణ అధ్యక్షుడు గుండు నర్సింహగౌడ్‌‌‌‌, నాయకులు ఎరుకల వెంకటేశ్‌‌‌‌గౌడ్, బొజ్జ సాంబేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా సృజన
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన ఉస్తేల సృజన రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్లు, హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.

4న మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం
సూర్యాపేట, వెలుగు : ఈ నెల 4న సూర్యాపేటలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మున్నూరుకాపు మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి రమేశ్‌‌‌‌ తెలిపారు. ఈ మేరకు గురువారం పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌‌‌‌ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌‌‌‌తో పాటు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మణ్‌‌‌‌ హాజరవుతారన్నారు.


పిల్లలు ఎత్తు పెరుగుతలే..
యాదాద్రి జిల్లాలో 3,430 మంది 
హైట్‌‌‌‌ తక్కువ ఉన్నారని గుర్తింపు
 1,154 చిన్నారులు మరింత కురచ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ప్రధాన సమస్యగా మారింది. ఐసీడీఎస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌, ఇతర పథకాల ద్వారా చిన్నారుల బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సరైన పౌష్ఠికాహారం అందకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. రక్తహీనత సమస్యతో పాటు బరువు, ఎత్తు పెరగడం లేదు. తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, చిన్నారులకు ముర్రుపాలు పట్టించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. యాదాద్రి జిల్లాలోని 17  మండలాల్లో ఆరేండ్ల లోపు పిల్లలు 41,088 మంది ఉన్నారు. వీరు వయసుకు తగ్గ ఎత్తు, బరులు ఉన్నారా ? లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇటీవల ఐసీడీఎస్‌‌‌‌ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. పౌష్టికాహారం లోపం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల లోపించిందని గుర్తించారు. జిల్లాలోని 41,088 మంది చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు కేటగిరిలో 521 మంది, ఎత్తుకు తగ్గ బరువు కేటగిరీలో 644 తక్కువ వెయిట్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. అలాగే వయసుకు తగ్గ ఎత్తు కేటగిరిలో మొత్తం 3,430 మంది ఎత్తు తగ్గువగా ఉన్నట్లు తేలగా, ఇందులో 1,154 మంది మరీ కురచగా ఉన్నట్లు ఆఫీసర్లు తేల్చారు. 
నేటి నుంచి పోషణ మాసం
పౌష్టికాహారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రీయ పోషణ మాసాన్ని నిర్వహిస్తున్నామని యాదాద్రి జిల్లా వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్​ కృష్ణవేణి తెలిపారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, పిల్లలలో రక్తహీనతను తగ్గించడం, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30 వరకు సదస్సులు, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

కార్యకర్తలు కాంగ్రెస్‌‌లోనే ఉన్నరు
మునుగోడు, వెలుగు : కాంగ్రెస్‌‌ నుంచి నాయకులు మాత్రమే ఇతర పార్టీల్లోకి వెళ్లారని, కార్యకర్తలంతా కాంగ్రెస్‌‌లోనే ఉన్నారని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌‌ నాయక్‌‌ చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్‌‌ బలంగానే ఉందని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గెలుపు ఖాయమన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో గురువారం మీడియాతో మాట్లాడారు. శనివారం పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డితో పాటు సీనియర్‌‌ నాయకులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కిగౌడ్‌‌లు మునుగోడుకు రానున్నట్లు చెప్పారు. నాయకులు పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, విష్ణువర్ధన్‌‌రెడ్డి, పోలగోని సత్యం, బూడిద లింగయ్య యాదవ్,  జాల వెంకన్నయాదవ్ పాల్గొన్నారు.

బీజేపీలో చేరికలు
మునుగోడు, వెలుగు : మునుగోడు మండలంలోని బట్లకాల్వ, పులిపలుపుల, జమస్తాన్‌‌‌‌పల్లి, మునుగోడుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన యువకులు గురువారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలు మునుగోడు చేరాలంటే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కుంభం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌‌‌‌రెడ్డి, అంతిరెడ్డి, పాలకూరి యాదయ్య, విజయ్ పాల్గొన్నారు.

ట్రాన్స్‌‌‌‌ఫర్లు, పదోన్నతుల షెడ్యూల్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేయాలి
సూర్యాపేట, వెలుగు : టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్ల షెడ్యూల్‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని టీపీయూఎస్‌‌‌‌ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి యామ రమేశ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. చివ్వెంల మండలంలోని పలు ప్రైమరీ, హైస్కూల్‌‌‌‌, కేజీవీబీ, గురుకులాల్లో గురువారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. జిల్లా కోశాధికారి లింగంపల్లి హరిప్రసాద్, మండల శాఖ అధ్యక్షులు బట్టిపల్లి సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శి యలమకొండ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఆలయ మడిగల్లో హిందువులే వ్యాపారం చేసేలా చూడాలి
యాదగిరిగుట్ట, వెలుగు : ఆలయ మడిగల్లో హిందువులే వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె ప్రవీణ్, భజరంగ్‌‌‌‌దళ్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు కోకల సందీప్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ మడిగల్లో అన్యమతస్థులు వ్యాపారం చేస్తున్నారంటూ గురువారం ఈవో క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన షాపులు దక్కించుకున్న టెండర్‌‌‌‌దారుల నుంచి అన్యమతస్తులు సబ్‌‌‌‌లీజ్‌‌‌‌కు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఈవో గీతారెడ్డికి ఫిర్యాదు చేసినా 
పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ఏఈవో శ్రావణ్‌‌‌‌కుమార్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. 
టెండర్ దారుడికి నోటీసులు
ఆలయ మడిగల్లో అన్యమతస్తులు వ్యాపారం చేస్తున్నారని గురవారం ఈవో ఆఫీస్‌‌‌‌ ఎదుట వీహెచ్‌‌‌‌పీ, భజరంగ్‌‌‌‌దళ్‌‌‌‌ ధర్నాకు దిగడంతో ఆఫీసర్లు స్పందించారు. సంబంధిత షాపును తనిఖీ చేసి విచారణ జరపడంతో షాపు నడుపుతుంది అన్యమతస్తులేనని తేలింది. దీంతో మడిగను దక్కించుకున్న వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్‌‌‌‌ అయితే టెండర్‌‌‌‌ రద్దు చేసి షాపును సీజ్‌‌‌‌ చేస్తామని హెచ్చరించారు.