ఐకాన్ స్టార్‌‌కు అరుదైన గౌరవం

ఐకాన్ స్టార్‌‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ‘అల్లు అర్జున్’ దూసుకెళుతున్నాడు. ఆయన నటించిన ‘పుష్ప’ ఘన విజయం సాధించింది. అందులో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ యమ పాపులర్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ’పుష్ప‘ బాక్సాపీస్ ను షేక్ చేసింది. సినీ, రాజకీయ, క్రీడ, ఇతర రంగాలకు చెందిన వారు.. ‘తగ్గేదే లే’ డైలాగ్స్ పలికారు. తాజాగా..న్యూయార్క్ మేయర్, ఇతరులు ‘తగ్గేదే లే’ అంటూ ఫొజులిచ్చారు. అందులో ‘అల్లు అర్జున్’ కూడా ఉన్నారు. న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆయన చాలా స్పోర్టివ్ జెంటిల్ మెన్ అని కొనియాడారు. ఈ సందర్భంగా మేయర్ ఎరిక్ అడమ్స్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పెరేడ్ కు బన్నీ నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లో ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్’ ఇండియా డే పరేడ్ నిర్వహించింది. కలర్ ఫుల్ గా సాగిన ఈ పరేడ్ లో దాదాపు 4 లక్షల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తానా, నాట్స్ ప్రదర్శించిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల జాతీయ జెండాలను ఒకేసారి ప్రదర్శించడం ద్వారా రికార్డు నెలకొల్పారు. ఏటా న్యూయార్క్ లో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి.