బీజేపీ సీట్లను.. మామిడి ధరలతో పోల్చుతూ.. ఖురేషీ కామెంట్స్

బీజేపీ సీట్లను.. మామిడి ధరలతో పోల్చుతూ.. ఖురేషీ కామెంట్స్

ఇప్పుడు 400 ప్లస్ లో మాట్లాడుకుంటున్నారు.. మే చివరి నాటికి అది 250కు తగ్గుతుంది.. జూన్ మొదటి వారానికి మరింత తగ్గి 175 నుంచి 200కు పడిపోతుంది.. నేను మాట్లాడుతుంది మామిడి పండ్ల ధర గురించి.. ప్రతి మెసేజ్ ను రాజకీయాలతో ముడిపెట్టి చూడలేం అంటూ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.. తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఖురేషీ మామిడి పండ్ల గురించే మాట్లాడి ఉండొచ్చు.. అయితే చివర్లో రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని చెప్పటం ద్వారా పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. ప్రస్తుతం బీజేపీ నినాదం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని పదే పదే ప్రధాని మోదీ సైతం పిలుపుఇస్తున్నారు. దీంతో ఖురేషి వ్యాఖ్యలు బీజేపీకి నేరుగా తగిలాయి.

 బీజేపీ, ఎన్డీయే మద్దతుదారులతో పార్లమెంట్ లో 400 కంటే ఎక్కువ సీట్లు(  అబ్ కీ బార్ 400 పర్ అనే నినాదం )  గెలుచుకోవాలన్న లక్ష్యంతో  లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్న సంగతి  తెలిసిందే.. ఈ క్రమంలోనే   ఖురైషీ కామెంట్స్ పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.  బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని..  చాలా మందికి అర్థమయ్యిందంటూ ఓ నెటిజన్  కామెంట్ చేశారు.

 కొందరేమో ఖురేషీ కామెంట్స్ మామిడి పండ్ల రేట్లతో ముడిపెట్టడం బాగుందని కామెంట్స్ చేయగా..   ప్రధాని మోడీ, బీజేపీపై ఖురేషీకి ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది..ఖురేషీ గాంధీ కుటుంబానికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని  మరో నెటిజన్  కామెంట్ చేశారు.  సార్  మీరు అధికారికంగా  ఇండయా కూటమిలో చేరారా? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఖురేషీ  ఒకప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారని నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్ చేశారు.