టెన్నిస్ క్రీడాకారుల పోరాటానికి ఇటలీ మద్దతు

టెన్నిస్ క్రీడాకారుల పోరాటానికి ఇటలీ మద్దతు

రోమ్: టెన్నిస్ క్రీడాకారులు కోరుతున్న ప్రైజ్ మనీ పెంపునకు ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇటాలియన్ ఓపెన్‌‌ను ఐదో గ్రాండ్‌‌స్లామ్‌‌గా మార్చాలనే తన పట్టుదలను ఫెడరేషన్ అధ్యక్షుడు ఏంజెలో బినాఘీ వ్యక్తపరిచారు. గ్రాండ్‌‌స్లామ్ నిర్వాహక దేశాలు భారీగా ఆర్జిస్తూ క్రీడాకారులకు తక్కువ వాటా ఇవ్వడం అవమానకరమని బినాఘీ మండిపడ్డారు.

 ఈ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ పురుషుల కంటే మహిళలకు తక్కువ ప్రైజ్ మనీ ఇచ్చేవారని కానీ వచ్చే వారం రోమ్‌‌లో విజేతగా నిలిచే మహిళా క్రీడాకారిణి 1.055 మిలియన్ యూరోల ప్రైజ్ మనీ అందుకోనున్నట్లు చెప్పారు. ఇది పురుషుల విజేతకు ఇచ్చే మొత్తం (1.007 మిలియన్ యూరోలు) కంటే ఎక్కువ కావడం విశేషమని తెలిపారు.