కరోనా రాకుండా ఐటీసీ  నాసల్‌‌ స్ప్రే!

కరోనా రాకుండా ఐటీసీ  నాసల్‌‌ స్ప్రే!

న్యూఢిల్లీ: కరోనాను నివారించడానికి ముక్కులో కొట్టుకునే స్ప్రేను  ఐటీసీ డెవలప్ చేస్తోంది.  ప్రస్తుతం ఈ స్ర్పే పై క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ జరుగుతున్నాయని కంపెనీ ప్రకటించింది. ఐటీసీ లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ అండ్ టెక్నాలజీ సెంటర్, బెంగళూరులో పనిచేస్తున్న సైంటిస్టులు ఈ స్ర్పే ను డెవలప్ చేశారు. రెగ్యులేటరీ అనుమతులు వచ్చాక ఈ స్ర్పే ను  సావ్లాన్​ బ్రాండ్ కింద అమ్ముతారు. ‘క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండడంతో  మరిన్ని విషయాలను బయటపెట్టలేము’ అని కంపెనీ స్పోక్స్‌‌‌‌పర్సన్‌‌‌‌ అన్నారు. ఎక్కడ క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ను స్టార్ట్ చేశారు?  అప్రూవల్స్ వస్తే ఎక్కడ నుంచి అమ్మకాలు స్టార్ట్ చేస్తారు? వంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు.  కాగా, ఈ స్ప్రేకు సంబంధించి కంపెనీకి ఇప్పటికే క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ–ఇండియా నుంచి అనుమతులొచ్చాయి.  కరోనా వైరస్ ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌లోనే  ఇది ఆపుతుందని ఐటీసీ తెలిపింది.