
మంగపేట, వెలుగు: హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించడంలో వార్డెన్లు దృష్టి పెట్టాలని ఐటీడీసీ పీఓ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం మండలంలోని బ్రహ్మనపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, చుంచుపల్లి బాలికల ఆశ్రమ స్కూళ్లను చిత్రామిశ్రా, డీడీటీ డబ్ల్యు పోషం సందర్శించారు. హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ఉండాలని, గిరిజన సంక్షేమ శాఖల ఏఈ ల సమన్వయంతో పనులు చేసుకోవాలని తెలిపారు. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని చిత్రామిశ్రా హెచ్చరించారు.