OTT Movies..చంపిందెవరు?

OTT Movies..చంపిందెవరు?

చంపిందెవరు?

టైటిల్ : జానే జాన్‌‌

డైరెక్షన్ : సుజయ్‌‌ఘోష్‌‌

కాస్ట్ : కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, సౌరభ్‌‌సచ్‌‌దేవ, నైషా ఖన్నా 

లాంగ్వేజ్ : హిందీ

ప్లాట్ ఫాం : నెట్‌‌ఫ్లిక్స్‌‌ 

మాయ డిసౌజా (కరీనా కపూర్‌‌‌‌ఖాన్‌‌) భర్తతో విడిపోయి కూతురుతో కలసి ఉంటుంది. కొన్నేండ్ల తర్వాత భర్త అజిత్‌‌మాత్రే (సౌరభ్‌‌) తన ఇంటికి వచ్చి ఆమెను ఇబ్బంది పెడతాడు. కూతురు తార (నైషా ఖన్నా)ను చూసి, ఆమెను పెద్ద స్టార్‌‌ను చేస్తానని తనతో పంపమని అడుగుతాడు. అందుకు మాయ ఒప్పుకోదు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అజిత్‌‌ నుంచి కూతుర్ని రక్షించే క్రమంలో హీటర్‌‌ వైర్‌‌ను అతడి మెడకు చుట్టి చంపేస్తుంది. కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక పక్కింటి మ్యాథ్స్‌‌ టీచర్ నరేన్‌‌వ్యాస్‌‌(జైదీప్‌‌అహ్లావత్‌‌) సాయం తీసుకుంటుంది. అతను మ్యాథ్స్‌‌లో జీనియస్‌‌. కాబట్టి ఆ నాలెడ్జ్‌‌తో సాయం చేస్తాడు. అజిత్‌‌ మాత్రేను వెతుక్కుంటూ వచ్చిన పోలీస్‌‌ ఆఫీసర్‌‌ కరణ్‌‌ ఆనంద్‌‌(విజయ్‌‌వర్మ) ఈ కేసును ఎలా ఛేదించాడు? అసలు అజిత్‌‌, మాయలు ఎందుకు విడిపోయారు?  తెలియాలంటే సినిమా చూడాలి.  ఈ సినిమా కథను జపనీస్‌‌ నవల ‘ది డివోషన్‌‌ ఆఫ్‌‌ సస్పెక్ట్‌‌ ఎక్స్‌‌’ నుంచి తీసుకున్నారు. ఈ నవల ఆధారంగా జపనీస్‌‌ సినిమా కూడా వచ్చింది. ‘జానే జాన్‌‌’.. దృశ్యం సినిమాకు కాస్త దగ్గరగా ఉంటుంది. కానీ.. కొన్ని విషయాల్లో డైరెక్టర్‌‌‌‌ లాజిక్‌‌ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌‌ సీన్స్‌‌, సినిమాలో ట్విస్ట్‌‌లు, క్లైమాక్స్ బాగున్నాయి. 

మరో ప్రపంచం!

టైటిల్ : అదియే

డైరెక్షన్ : విఘ్నేష్ కార్తీక్

కాస్ట్ : జివి.. ప్రకాశ్కుమార్‌‌‌‌, వెంకట్‌‌ప్రభు, గౌరీ జి కిషన్‌‌

లాంగ్వేజ్ : తమిళం

ప్లాట్ ఫాం :  సోనీలివ్‌‌

జీవా (జివి ప్రకాష్) స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. అదే టైంలో అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోతారు. దాంతో జీవా ఒంటరి వాడవుతాడు. చాలా ఇబ్బందులు పడతాడు. అతని జీవితం కష్టాల్లో కూరుకుపోతుంది. కొందరు అతనికి సాయం చేస్తారు. అలా కొంత కాలం గడిచిపోతుంది. కట్‌‌చేస్తే.. సెంథాజిని ఫేమస్‌‌ సింగర్‌‌‌‌గా మారుతుంది. అయితే.. ఆమె ఒక ఇంటర్వ్యూలో తన అభిమాని నుండి వచ్చిన లెటర్ గురించి మాట్లాడుతుంది. ‘‘ఆ లెటర్‌‌‌‌ వల్ల నేను చాలా మోటివేట్‌‌ అయ్యా. అందుకే ఆ లెటర్ రాసిన వ్యక్తిని ప్రేమిస్తున్నా. కానీ.. అతను ఎవరనేది తెలియద’’ని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న జీవా చాలా బాధపడతాడు. అందుకు కారణం ఆమె చెప్పేది తను రాసిన లెటర్ గురించే. వెంటనే సెంథాజిని దగ్గరకు వెళ్లి ‘ఆ లెటర్‌‌‌‌రాసింది నేనే’ అని చెప్పాలి అనుకుంటాడు. కానీ.. అతనికి యాక్సిడెంట్‌‌ అవుతుంది. అప్పుడు అతను ప్యారలల్‌ యూనివర్స్‌‌కి వెళ్తాడు. అక్కడ జీవా పేరు అర్జున్. సెంథాజిని అతని భార్య. దాంతో అతనికి అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఉన్న యూనివర్స్‌‌లో కూడా సెంథాజిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? లవ్‌‌ యాంగిల్‌‌తో పాటు సైన్స్ ఫిక్షన్‌‌ని కూడా బాగా హ్యాండిల్‌‌ చేశారు ఇందులో. ఆర్జే విజయ్ కామెడీ బాగుంది. 

ముగ్గురిది ఒకే ఎమోషన్‌‌

టైటిల్ : ఆర్‌‌డీఎక్స్‌‌

డైరెక్షన్ : నహాస్‌‌హిదయనాథ్‌‌

కాస్ట్ :  షేన్ నిగమ్‌‌, బిజు సంతోష్, ఆంటోనీ వర్గీస్‌‌, నీరజ్‌‌మాధవ్‌‌, మహిమా నంబియార్‌‌, మలాల్‌‌పార్వతి, లాల్‌‌

లాంగ్వేజ్ : మలయాళం 

ప్లాట్ ఫాం : నెట్‌‌ఫ్లిక్స్‌‌

కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ చర్చిలో ఈ కథ మొదలవుతుంది. ప్రతి ఏడాది చర్చిలో జరిగే ఉత్సవాల్లో స్థానికంగా ఉండే ప్రజలంతా కలిసి ప్రార్థనలు చేస్తుంటారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యతను ఫిలిప్‌‌(లాల్‌‌)కు అప్పగిస్తారు. అయితే... సంగీత కచేరీ జరుగుతుండగా ఇద్దరు ఆకతాయిలు హంగామా చేస్తారు. అందరినీ డాన్స్‌‌ చేయాలని బలవంతపెడతారు. ఫిలిప్ వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో వాళ్లు ఆయనతో గొడవపడతారు. అది గమనించిన ఫిలిప్ కొడుకు డానీ (ఆంటోనీ వర్గీస్‌‌) అక్కడికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో కోపంతో వాళ్లను కొడతాడు డానీ. అది మనసులో పెట్టుకున్న ఆ ఆకతాయిలు అదే రోజు రాత్రి ముసుగులు వేసుకొచ్చి డానీని, అతడి కుటుంబాన్ని విపరీతంగా కొడతారు. అప్పటివరకు వేరే ఊళ్లో ఉన్న ఫిలిప్  రెండో కొడుకు రాబ‌‌ర్ట్ (షేన్ నిగ‌‌మ్‌‌) దాడి విషయం తెలుసుకుని కొచ్చికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లపై దాడి చేయడానికి ఉత్సవాల్లో జరిగిన గొడవే కారణమా? దాడి చేసిన వాళ్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు? ఆ గొడవలోకి డానీ ఫ్రెండ్‌‌ జేవియర్ ఎందుకొచ్చాడు? ఇది.. రాబర్ట్‌‌(R), డానీ(D), జేవియర్‌‌(X) అనే ముగ్గురు స్నేహితుల కథ. ఎమోషన్స్‌‌, కామెడీ బాగానే ఉన్నాయి. ఇందులో యువతను ఆకట్టుకునే స్పెషల్‌‌ ఎలిమెంట్ మార్షల్‌‌ ఆర్ట్స్‌‌కూడా ఉంది. కథ కొత్తది కాకపోయినా ప్రెజంట్‌‌ చేసిన విధానం బాగుంది.