
జబర్దస్త్(Jabardasth) కమెడియన్ కెవ్వు కార్తీక్(Kevvu Karthik) ఓ ఇంటివాడు అయ్యాడు. శ్రీలేఖ(Srilekha)తో కెవ్వు కార్తీక్ వివాహం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు హజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ పెళ్ళికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరంగల్ కు చెందిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. నటనపై ఉన్న మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తతం కార్తీక్ పలు టీవీ షోలతో పాటు, సినిమాల్లోనూ నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన నేను స్టూడెంట్ సర్, ముఖచిత్రం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు కార్తీక్.