పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే.. జనసేన నుంచి పోటీకి సిద్దం

పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే.. జనసేన నుంచి పోటీకి సిద్దం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే..  ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు రంగస్థలం ఫేమ్ మహేష్. జబర్థస్త్ షోద్వారా ఫేమస్ అయిన ఈ కమెడియన్.. రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో పాటు ఇండస్ఠీ చూపుని తనవైపుకి తిప్పుకున్నాడు. దాంతో జబర్థస్త్ మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు మహేష్.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి   ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో బాగంగానే మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై కూడా కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్‌ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్​ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానన్నారు మహేష్. అంతే కాదు ఆయన గొప్ప మనస్తత్వం గురించి చెపుతూ.. మూవీ సెట్స్​లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో, ఏం తింటారో కూడా చెప్పుకొచ్చాడు. ఇక కెరీర్ మొదట్లో తన ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా వివరించాడు.

సినిమాల పట్ల తనకున్న ఇష్టంతో ఈస్ట్ గోదావరి నుండి హైదరాబాద్ వచ్చానని, ఆ సమయంలో చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదని, తన తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని, ఈజీవితం ఎందుకు అని విరక్తి కలిగింది అన్నారు మహేష్. ఇక సుకుమార్ గారి వల్ల.. ప్రస్తుతం తాను సినిమాల్లో నటిస్తూ.. లైఫ్ ను లీడ్ చేస్తున్నాను అన్నారు. తన ఊరిలో పవన్ కల్యాళ్ అభిమానుల ఎక్కువగా ఉన్నారని. జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు. దేవుడి దయ వల్ల పార్టీ తరఫున తనకు పోటీచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉందని మహేష్​ వివరించారు. ప్రస్తుతం మహేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.