ప్రియురాలిని పెళ్లాడిన జబర్దస్త్ ఫేం కిరాక్ ఆర్పీ

ప్రియురాలిని పెళ్లాడిన జబర్దస్త్ ఫేం కిరాక్ ఆర్పీ

జబర్దస్త్‌’ ఫేమ్‌ కిరాక్‌ ఆర్పీ కి పెళ్లైంది. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారివురు ఒక్కటయ్యారు. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వీరి వివాహం నవంబరు 29న రాత్రి జరిగింది. ‘మేం ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రసన్నది వైజాగ్‌. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు వీఐపీలు, సినీ సెలబ్రిటీలు వచ్చారు. వివాహాన్ని మాత్రం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలనుకున్నాం. అందుకే గోప్యంగా ఉంచాం’’ అని కిరాక్‌ ఆర్పీ తెలిపారు.