
కమెడియన్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన షకలక శంకర్.. జబర్ధస్త్ ప్రోగ్రాం ద్వారా రెండు రాష్ట్రాలలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగాను నటించాడు. ఆయన తాజాగా కరోనా బాధితులను ఆదుకోవడం కోసం కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. ఆ విధంగా వచ్చిన 90 వేల రూపాయలకు మరో 10 వేల రూపాయలు కలిపి ఏడు కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. కొన్ని రోజుల క్రితం ఆయన లక్షాపది వేల రూపాయలతో ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు, నాగలి బహుకరించి ఆదుకున్నాడు.
భిక్షాటన కార్యక్రమం చేపట్టేలా తనను ప్రేరేపించి, అందుకు సహకరించిన కరీంనగర్ ‘విందు భోజనం’ మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్‌లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొకసారి ఇలాంటి సేవా కార్యక్రమం చేయలనుకుంటున్నానని.. అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నట్లు శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందని శంకర్.. ఆర్థిక స్తోమత కారణంగా పదోతరగతితోనే చదువుకు స్వస్థి చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని.. ఎలాగైనా సినిమాల్లో చేరాలని 2002లో హైదరాబాదుకు వచ్చాడు. కొన్నిరోజులు ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సినీరంగ పరిచయాలతో సినిమాలలో అవకాశాన్ని దక్కించుకున్నాడు.
For More News..