జాబ్రా నుంచి ఎవాల్వ్2 65 ఫ్లెక్స్

జాబ్రా నుంచి ఎవాల్వ్2 65 ఫ్లెక్స్

హైదరాబాద్​, వెలుగు: ఆడియో ఎక్విప్​మెంట్​తయారీ సంస్థ జాబ్రా ఎవాల్వ్​2 65 ఫ్లెక్స్​ పేరుతో ప్రీమియం హ్యాండ్​సెట్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆఫీసు పనులకు ఇది అనువుగా ఉంటుందని తెలిపింది. జాబ్రా లింక్ 380 బ్లూటూత్ అడాప్టర్‌‌ని ఉపయోగించి హెడ్‌‌సెట్‌‌ను సులువుగా కనెక్ట్ చేయవచ్చు. మీ కంప్యూటర్​కు 30 మీటర్ల దూరంలో ఉన్నా దీనిని వాడుకోవచ్చు. 

డ్యూయల్ బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల రెండు పరికరాలను ఒకేసారి కనెక్ట్​ చేయవచ్చు. ఇందులోని 28 ఎంఎం స్పీకర్ల వల్ల ఆడియో నాణ్యత చాలా బాగుంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌‌లు,  వర్చువల్ మీటింగ్స్​కు చక్కగా సరిపోతుంది. ఒక్కసారి చార్జ్​ చేస్తే 32 గంటలపాటు వాడుకోవచ్చు. ధర దాదాపు రూ.45 వేలు.