- లేకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం: మాజీ సర్పంచుల సంఘం జేఏసీ
- ప్రజాభవన్ ఎదుట నిరసన
హైదరాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఇవ్వకపోతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించింది. సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు మంగళవారం ప్రజాభవన్ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా మాజీ సర్పంచులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రజాభవన్లో 13 సార్లు వినతిపత్రాలు అందజేసినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులుగా గ్రామాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు వెచ్చించి, అప్పులు తెచ్చి, పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.
