
- అక్బరుద్దీన్ పై ప్రజా సంఘాల జేఏసీ ఫైర్
ఖైరతాబాద్, వెలుగు: దళితులను అవమానిస్తే ఊరుకోబోమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేను అవమానించిన అక్బరుద్దీన్ ఒవైసీకి తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నేత, జేఏసీ చైర్మన్గజ్జెల కాంతం హెచ్చరించారు. ఉన్నతవిద్యావంతుడైన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను అవమానించే ముందు అక్బరుద్దీన్ తన గురించి ఓ సారిఆలోచించుకోవాలని అన్నారు.
దళిత ,బీసీ సామాజిక వర్గాల జోలికి వస్తే దాడులు జరుగుతాయని చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయణకు ఒవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కు .. ఎంఐఎం బీ టీంగా పనిచేస్తోందని గజ్జెల కాంతం తెలిపారు. అందుకే ఒవైసీ నేతలపై ఈడీ దాడులుగాని, సీబీఐ, పోలీసు కేసులుగాని లేవని వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తానే తెచ్చానన్న భ్రమలో ఉన్నారని, తెచ్చింది తెలంగాణ ఉద్యమకారులైతే , ఇచ్చింది కాంగ్రెస్ అని వివరించారు.