జడ్చర్లలో కిడ్నాప్‌‌‌‌.. మైలారంలో హత్య

జడ్చర్లలో కిడ్నాప్‌‌‌‌.. మైలారంలో హత్య
  • నెల రోజుల కింద కనిపించకుండా పోయిన వ్యక్తి
  • ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేసినట్లు నిర్ధారణ

కోడేరు/అచ్చంపేట/పెద్ద కొత్తపల్లి, వెలుగు : నెల రోజుల కింద కనిపించకుండా పోయిన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా కోడేరు మండలంలోని మైలారం గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అతడిని కిడ్నాప్‌‌‌‌, హత్య చేసిన వ్యక్తిని గురువారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌‌‌‌ వెల్లడించారు. 

మండలంలోని మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి యాదవ్ (46) గత నెల 29 నుంచి కనిపించకుండా పోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగస్వామి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ డేటా ఆధారంగా విచారణ చేపట్టగా.. అచ్చంపేటకు చెందిన పులేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. 

దీంతో రంగస్వామిని జడ్చర్ల బస్టాండ్‌‌‌‌ వద్ద కిడ్నాప్‌‌‌‌ చేసి.. బల్మూర్‌‌‌‌ మండలం మైలారంలో హత్య చేసినట్లు పులేందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరికి ఆరు నెలల కిందే పరిచయం అయిందని, గుప్త నిధుల తవ్వకాల విషయంలో పులేందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ రంగస్వామికి రూ. 5 లక్షలు ఇచ్చాడన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగగా.. రంగస్వామని జడ్చర్ల వద్ద కిడ్నాప్‌‌‌‌ చేసి మైలారం సమీపంలోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి కల్లులో మత్తు మందు కలిపి తాగించిన అనంతరం గడ్డపారతో కొట్టి హత్య చేశారని డీఎస్పీ వివరించారు. 

రంగస్వామి డెడ్‌‌‌‌బాడీని బయటకు తీసి పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించామని, హత్యలో పులేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌తో పాటు మరికొందరు సైతం ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పులేందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌‌‌‌కు పంపినట్లు తెలిపారు.