రాష్ట్రాభివృద్ధిపై చర్చకు సిద్ధమా!

రాష్ట్రాభివృద్ధిపై చర్చకు సిద్ధమా!

రాజ్యాంగం జడ పదార్థం కాదని..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు చాలాసార్లు సవరణలు చేశారని...మార్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రజల ముందు ప్రస్తావించారన్నారు.  ప్రజల అవసరాల కోసం రోడ్లను వెడల్పు చేసుకున్నట్లే రాజ్యాంగం కూడా మార్చుకోవాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. తెలంగాణతో పోటీవచ్చే రాష్ట్రాలే లేవని..ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. 

మరిన్ని వార్తల కోసం

మీ దాగుడుమూతల పర్యటనలతో ఒరిగేదేమిటి?

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ