
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరికి అందజేశారు. అంతేకాకుండా తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టర్ మే 10న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి టిక్కెట్‌ను ఆశించారు.
అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ గత అర్థరాత్రి వరకు ఆయనను బుజ్జగించేందుకుప్రయత్నించారు. కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్టాండ్‌పై గట్టిగా నిలబడ్డారు. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.