కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ

కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  కౌలు రైతులకు రైతుభరోసా నిధులనుతాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వర్చువల్‌గా బటన్‌ నొక్కి నిధుల్ని జమ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని  వైసీపీ ప్రభుత్వం.. ఇవాళ ( సెప్టెంబర్ 1) కౌలు రైతులకు  YSR రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా, కౌలు రైతులతోపాటూ.. దేవాదాయ, అటవీ భూముల్ని సాగుచేస్తున్న వారికి కూడా ఈ నిధులు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులు 109.74 కోట్ల రూపాయిలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.  . ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్‌లో రూ.7,500 జమ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో లక్షా46 వేల 324 మంది కౌలు రైతులు లబ్ధి పొందనున్నారు. 

రాష్ట్రంలోని 80 శాతం మంది రైతులకు.. 80 శాతం పెట్టుబడికి ఈ నిధులు సరిపోతాయని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఎప్పుడెప్పుడు డబ్బు అవసరమో.. అప్పుడప్పుడు ఈ నిధులను ఇస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు నష్టపోకుండా నాలుగు సంవత్సరాలుగా ఈ పథకం ఆదుకుంటోందని తెలిపారు. రకరకాల పంటలు వేస్తూ, రకరకాల పంటలు వేస్తూ నష్టపోయిన 11 వేల 373 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.11 కోట్లను మనీని ఇచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.  గోదావరి వరదల్లో నష్టపోయిన రైతులకు రూ.38 కోట్లను పరిహారంగా ఇచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.

ఇప్పటివరకు 5 లక్షల 38 వేల 227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు.... 3 లక్షల 99 వేల 321 మంది అటవీ భూమి సాగుదారులకు   పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని సీఎం పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 3 దఫాలుగా.. రూ.13,500 నిధులు ఇస్తోంది. ఇందులో రూ.6,000 కేంద్రం ఇస్తోంది. ప్రతీ సంవత్సరం వైసీపీ ప్రభుత్వం మేలో రూ.7,500.. అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేలు ఇస్తోంది. రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగామని తెలిపారు.