పుష్ప2 అప్డేట్.. లీక్ చేసిన జగపతిబాబు 

పుష్ప2 అప్డేట్.. లీక్ చేసిన జగపతిబాబు 

హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జగపతిబాబు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ పాత్రలతో మెప్పించాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వార్తుల.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, పుష్ప2లో నటిస్తున్నట్లు స్వయంగా జగపతిబాబు ఒప్పుకున్నాడు. 

సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ సినిమా ప్రమోషన్స్‌లో  మాట్లాడిన  జగపతిబాబు పుష్ప-2లో నటిస్తున్నట్లు రివీల్ చేశాడు. ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ‘సుకుమార్‌తో కలిసి పనిచేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. పుష్ప-2లో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నా. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయడమే బలే ఇష్టం. ఆయన డైరెక్షన్ లో పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు.