మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచాం : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచాం : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచామని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి అన్నారు. శనివారం కొండాపూర్ మల్కాపూర్ పరిధిలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో  మొదటి విడతలో గెలిచిన, ఓడిన కాంగ్రెస్​అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోయినప్పటికీ కాంగ్రెస్ కండువాతో గెలిచినా, ఓడినా తనకు సర్పంచ్ లే అని ముందే చెప్పానని గుర్తు చేశారు. గెలిచిన వారిని టీజీ ఐఐసీ చైర్​పర్సన్​ నిర్మల జగ్గారెడ్డి,  ఓడిన వారికి తాను సన్మానం చేస్తానని చమత్కరించారు. నియోజకవర్గంలో 45 పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారన్నారు.

 గెలిచిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రెబల్​గా పోటీ చేసిన వారికి పార్టీలో అవకాశం లేదన్నారు. ఇండిపెండెంట్​గా గెలిచిన వారు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకుల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.