బహ్రెయిన్ లో తెలంగాణ యువకుడు సూసైడ్.. కారు క్లీనర్ గా పనిచేస్తున్న జగిత్యాల వాసి

బహ్రెయిన్ లో  తెలంగాణ యువకుడు సూసైడ్.. కారు క్లీనర్ గా పనిచేస్తున్న జగిత్యాల వాసి

జగిత్యాల టౌన్, వెలుగు: బహ్రెయిన్​  దేశంలో జగిత్యాలకు చెందిన వలస జీవి బర్త్​ డే రోజే సూసైడ్  చేసుకున్నాడు. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌ కు చెందిన లావణ్య, శంకర్  దంపతుల కొడుకు అనుమండ్ల కల్యాణ్‌(26) గత కొంత కాలంగా బెహరాన్‌ లో కార్‌  వాష్‌  క్లీనర్‌ గా పని చేస్తున్నాడు. 10 నెలల కింద బెహరాన్‌  వెళ్లిన కల్యాణ్‌  అక్కడ జీతం సరిపోక మరో ఉద్యోగానికి ప్రయత్నించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తులు మోసం చేయడంతో మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కల్యాణ్‌  మృతిపై వారు అనుమానం వ్యక్తం చేశారు.