కూతుర్ల చదువు కోసం అమ్మ ఆత్మహత్య

కూతుర్ల చదువు కోసం అమ్మ ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాయికల్ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన అరికెళ్ల లావణ్య అనే ఆశా వర్కర్ అప్పుల బాధతో సోమవారం అర్థ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో లావణ్య తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని చనిపోయినట్లు మృతురాలి తల్లి తెలిపింది.

పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరు కుమార్తెలు హైదరాబాదులో చదువుకుంటున్నారు. చిన్న కుమార్తె కరీంనగర్ లో పాలిటెక్నిక్ చేస్తుంది. మృతురాలి భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. అయితే లావణ్య తన కూతుర్ల చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఉరివేసుకొని చనిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.