
ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచయమై, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న నటి రీతూ చౌదరి. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు 9 ' వేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఆమె ఎంట్రీపై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. బిల్లితెర రియాల్టీ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివాదాల పయనంతో రీతూ చౌదరి ..
జబర్దస్త్ షో ద్వారా రీతూ చౌదరి మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే, ఆమె కెరీర్ కేవలం గ్లామర్‌తోనే ఆగలేదు. కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. గతంలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు రావడంతో ఆమెను పోలీసులు విచారించారు. అంతేకాకుండా, ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె పాత్ర ఉందంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణలను ఆమె గట్టిగా ఖండించారు. ఇన్ని వివాదాల నేపథ్యంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ప్రవేశించడం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలను కొంతమేరకు అయినా తగ్గించుకోవచ్చని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
డబుల్ హౌస్‌తో సరికొత్త వినోదం!
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న 'బిగ్ బాస్ తెలుగు 9' సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈసారి సరికొత్తగా డబుల్ హౌస్.. డబుల్ డోస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అరుదైన ఫార్మాట్ షోపై అంచనాలను మరింత పెంచింది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. 'బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష' ద్వారా ఐదుగురు సామాన్యులను మెయిన్ హౌస్‌లోకి ఎంపిక చేయనున్నారు. దీంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
జబర్దస్త్ నుంచి 'బిగ్ బాస్' లోకి రీతూ రావడం అనేది ఆమె కెరీర్‌లో ఒక పెద్ద మలుపు కానుంది. ఆమె వివాదాలు, గ్లామర్, ప్రవర్తన... ఇవన్నీ 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య జరిగే ఈ రణరంగం ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే గ్రాండ్ లాంచ్ కోసం మరొ మూడు రోజులు వేచి చూడాల్సిందే. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండటంతో అభిమానుల్లో 'బిగ్ బాస్' ఫీవర్ ఇప్పటికే మొదలైంది. ఈ సీజన్ వినోదం, ఉత్కంఠ, ఊహించని మలుపులతో నిండి ఉంటుందని బిగ్ బాస్ టీమ్ హామీ ఇస్తోంది.