వా ...నువ్వు కావాలయ్యా...బుడ్డోడి డ్యాన్స్కు ఫిదా అవ్వాల్సిందే

వా ...నువ్వు కావాలయ్యా...బుడ్డోడి డ్యాన్స్కు ఫిదా అవ్వాల్సిందే

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ సాంగ్..వా... నువ్వు కావాలయ్యా... నువ్వు కావాలి ప్రస్తుతం యూట్యూబ్​ను షేక్ చేస్తోంది.  ముఖ్యంగా ఈ పాటలో  తమన్నా వేసిన హుక్‌ స్టెప్  తెగ పాపులర్ అయింది. ఎక్కడ చూసినా ఈ స్టెప్పే కనిపిస్తోంది. పాటతో పాటు..తమన్నా స్టెప్పులు  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో హుక్‌ స్టెప్పులను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో  అభిమానులు తెగ పోస్ట్ చేస్తున్నారు.  అందులో ఓ బాలుడు చేసిన  స్టెప్పులు.. మస్తు ట్రెండ్  అయ్యాయి.

జైలర్ నుండి రిలీజ్ అయిన కావాలయ్యా సాంగ్.. యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. మూడు వారాల కిందట రిలీజ్ అయిన కావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాలో తగె హల్ చల్ చేస్తోంది. పాట మొదట్లో కొంచెం అసంతృప్తిగా అనిపించినా..వింటున్నా కొద్దీ..అందరికీ ఎక్కేసింది.  ఇప్పుడు ఇన్ స్టా రిల్స్,  యూట్యూబ్ షాట్స్ లో ఎక్కడ చూసినా  కావాలయ్యా సాంగ్  మార్మోగిపోతుంది. ఈ సాంగ్ కి జానీ మాస్టర్  కంపోజ్ చేయడం..దీనికి మిల్కీ బ్యూటీ తమన్నా  ఎనర్జీతో స్టెప్పులు  వేయడంతో సాంగ్ సూపర్ డూపర్..బంపర్ హిట్ అయింది.