నాంపల్లి ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ స్టాల్

నాంపల్లి ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ స్టాల్

హైదరాబాద్లోని నాంపల్లిలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ను జైళ్ల శాఖ డీజీ జితేందర్ ప్రారంభించారు. ఈ స్టాల్లో చేనేత హస్త కళలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఖైదీలకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ.. వారితోనే పలు వస్తువులను తయారు చేయిస్తున్నామని జితేందర్ తెలిపారు.  శిక్ష సమయంలో వేతనంతో పాటు శిక్ష పుర్తైన తర్వాత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.