ప్రతిపక్షాలను చీల్చేందుకు మోదీ సర్కార్ కుట్రలు..కాంగ్రెస్‌‌ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్‌‌ ఫైర్

ప్రతిపక్షాలను చీల్చేందుకు మోదీ సర్కార్ కుట్రలు..కాంగ్రెస్‌‌ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్‌‌ ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: గత సెషన్​లో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో పార్లమెంట్‌‌లో మెజార్టీని మానిప్యులేట్ చేయడం కోసం ప్రధాని మోదీ సర్కార్ ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఫైర్ అయ్యా రు. ఇందులో భాగంగానే టీఎంసీ, శివసేన పార్టీలను చీల్చారని ఆరోపించారు.

ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ "గత ఏప్రిల్ 16, 17 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణకు 352 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, కేవలం 298 మంది మాత్రమే మద్దతు పలికారు’ అని గుర్తుచేశారు. డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక విపక్షాలను చీల్చాలనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత ప్రమాదకరమన్నారు.