బీజేపీ నేత కైలాష్ వ్యాఖ్యలపై జైరాం రమేష్ సెటైర్

బీజేపీ నేత కైలాష్ వ్యాఖ్యలపై జైరాం రమేష్ సెటైర్

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో  బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఆయన కామెంట్స్పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. 2019లో బీజేపీ ప్రారంభించిన చౌకీదార్ కు అర్ధం ఇప్పుడు తెలిసింది అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ‘‘2019లో  బీజేపీ పార్టీ ప్రారంభించిన మై బీ చౌకీదార్ కి అర్ధం ఇప్పుడు తెలిసొచ్చిందని’’ ట్వీట్ చేశారు.

కాగా అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామంటూ కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అని వ్యాఖ్యానించారు.