
ఢిల్లీ : ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో అదనపు బలగాలను మోహరించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.