టెర్రర్​ జాబితాలోకి జైషే కమాండర్ నెంగ్రూ

టెర్రర్​ జాబితాలోకి జైషే కమాండర్ నెంగ్రూ

న్యూఢిల్లీ: నిషేధిత జైషే మహ్మద్ కమాండర్ ఆషిక్ అహ్మద్ నెంగ్రూ (34)ను కేంద్ర ప్రభుత్వం సోమవారం టెర్రరిస్టుగా ప్రకటించింది. జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న పలు టెర్రర్​ దాడులకు నెంగ్రూ సూత్రధారిగా వ్యవహరించాడని, పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టెర్రరిస్టు సిండికేట్ నడిపిస్తున్నాడని కేంద్ర హోంశాఖ పేర్కొంది. దేశ భద్రతకు ప్రమాదకరంగా మారిన నెంగ్రూను ఉపా చట్టం–1967 ప్రకారం టెర్రరిస్టుగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. పుల్వామాలో 20 నవంబర్ 1987లో పుట్టిన నెంగ్రూపై 2013లో పోలీసులను, 2020లో ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులు ఉన్నాయి. 2020లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీసులు ఇచ్చిన తర్వాత నెంగ్రూ, అతని ఫ్యామిలీ కనిపించకుండా పోయింది. నెంగ్రూ సోదరుడు అబ్బాస్ అహ్మద్ నెంగ్రూ కూడా జైషే మహ్మద్ కార్యాకలాపాల్లో చురుగ్గా ఉండేవాడు. కాగా, 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతడు హతమయ్యాడు.