
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు మన దేశం మరో విడత మానవతా సాయాన్ని పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్లో తెలియజేశారు. "మేము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాము" అని పోస్ట్ చేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండో సీ17 విమానం 32 టన్నుల ఆహారపదార్ధాలు, మెడిసిన్‌తో ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిందని జైశంకర్ తెలిపారు. మనదేశం పాలస్తీనాకు వైద్య, విపత్తు సాయాన్ని అక్టోబర్ 22న మొదటిసారి అందజేసింది.