ఇసుక టిప్పర్లను అడ్డుకున్న జాజాల గ్రామస్తులు

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న జాజాల గ్రామస్తులు

వంగూరు, వెలుగు: మండలంలోని జాజాల గ్రామస్తులు ఆదివారం దుందిభి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..దుందిభి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎం.కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, పర్వత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దామోదర్ యాదవ్, బెల్లి శ్రీశైలం యాదవ్, డి.నరేందర్ రెడ్డి, జిలకర సైదులు, పులిజాల అశోక్, మార్కండేయ, పరుశురాములు, పులిజాల ఆంజనేయులు, భాస్కర్  పాల్గొన్నారు.