
దక్షిణ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ అరుదైన రికార్డు సృష్టించాడు. టాస్మానియాతో మ్యాచ్ లో ఫ్రేజర్ 29 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో A క్రికెట్ లో డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం ఈ మ్యాచ్ లో 38 బంతుల్లో అతను 125 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 13 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టాస్మానియా.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో దక్షిణ ఆస్ట్రేలియా ధాటీగా బ్యాటింగ్ చేస్తుంది.