జమ్ము కశ్మీర్ అప్ డేట్స్

జమ్ము కశ్మీర్ అప్ డేట్స్
  • సొంత రాష్ట్రం వెళ్లేందుకు తనను అనుమతించాలన్న గులాంనబీ ఆజాద్ విజ్ఞప్తిని ఆమోదించింది సుప్రీం. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టంచేసిది. కోర్టు అనుమతితో గులాంనబీ ఆజాద్…. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్, జమ్మూకు వెళ్లనున్నారు. కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానన్నారు ఆజాద్.

  • జమ్మూకశ్మీర్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. అంతా ప్రశాంతంగా ఉంటే.. ఇన్ని రోజులుగా గులాంనబీ ఆజాద్ ను ఎందుకు శ్రీనగర్ వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ కు చెందిన నాయకుల ప్రాథమిక హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు.

  • ఢిల్లీలో ఉన్న కశ్మీర్ పౌరులు తమ ఇళ్లలు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలా..? అని ప్రశ్నించారు నేషనల్ పాంథర్స్ పార్టీ చీఫ్ భీంసింగ్. 50 ఏళ్లుగా నిర్బంధంతో కశ్మీర్ ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

  • జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ను ప్రయోగించారు పోలీసులు. ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే.. రెండేళ్ల పాటు ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచే అవకాశముంటుంది. ఇప్పటికే ఆయన గృహ నిర్భంధంలో ఉన్నారు.

  • ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘంలో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు బలోచ్, సింధ్ ఉద్యమకారులు. తమ ప్రాంతాల్లో పాకిస్థాన్ చేస్తున్న అరాచకాలను వివరించారు. కశ్మీర్ పై పాక్ చేస్తున్న రాద్ధాంతంపై మండిపడ్డారు.

  • మరోవైపు.. పాక్ ఆక్రమిత్  కశ్మీర్ లో ఇమ్రాన్ టూర్ సందర్భంగా.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. యువకులు, విద్యార్థులపై పాక్ పోలీసులు కేసులు ఫైల్ చేశారు.