మోదీకి 3 కేజీల వెండి లోటస్ స్పెషల్ గిఫ్ట్..

మోదీకి  3 కేజీల వెండి లోటస్ స్పెషల్ గిఫ్ట్..

జమ్మూ: మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్రమోదీకి జమ్మూకు చెందిన జువెలరీ వ్యాపారి, బీజేవైఎం అధికార ప్రతినిధి రింకూ చౌహాన్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు. మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో బీజేపీ గుర్తు.. కమలాన్ని రూపొందించారు. 

దీన్ని స్వయంగా తానే తయారు చేశానని, అందుకు 20 రోజులు పట్టిందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. బీజేపీ సర్కారు ఆర్టికల్ 370 ని రద్దు చేశాక మోదీకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. ఈ గిఫ్ట్​ను మోదీకి ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని చెప్పారు.