వైద్య రంగంలోనే అద్భుతం.. యూరిన్ బ్యాగ్ ప్లేస్ లో.. కూల్ డ్రింక్ బాటిల్.. !

వైద్య రంగంలోనే అద్భుతం.. యూరిన్ బ్యాగ్ ప్లేస్ లో.. కూల్ డ్రింక్ బాటిల్.. !

బిహార్ లో వైద్య వ్యవస్థ దుస్థితి గురించి తెలిపే ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. పేషెంట్​ మూత్రాన్ని సేకరించే యూరిన్​ బ్యాగ్​ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఏకంగా కూల్​డ్రింక్​ బాటిల్​ని మూత్ర సేకరణకు ఉపయోగించడం చర్చనీయాంశం అయింది. 

బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జముయ్​లోని గవర్నమెంట్​ ఆసుపత్రిలో ఓ రోగి అనారోగ్యంతో చేరాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతని మూత్రాన్ని సేకరించేందుకు యూరిన్​ బ్యాగ్స్​ స్టాక్​ అయిపోయింది. 

ALSO READ: Health : విటమిన్ డి లోపిస్తే.. డిప్రెషల్ లోకి వెళ్లిపోతారా.. పరిశోధనల్లో కీలక అంశాలు

దీంతో వైద్య సిబ్బంది తెలివి మితిమీరి స్ప్రైట్​ బాటిల్ ని ఆయన మర్మాంగానికి అమర్చారు.  కుటుంబసభ్యులు ఇదేంటని నిలదీయగా సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. ఈ దృశ్యాలను పలువురు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. 

సీఎం నీతిష్ కుమార్​ పరిపాలనలో వైద్య వ్యవస్థ దుస్థితి ఎలా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతూ ట్వీట్​ చేస్తున్నారు. మరొకరు ఈ వీడియోని ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​కు ట్యాగ్​చేస్తూ ప్రశ్నించారు. 

స్పందించిన మేనేజర్..

ఈ ఘటనపై హాస్పిటల్​ మేనేజర్​ స్పందించారు. రోగికి బాటిల్​ని అమర్చిన విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. ఇందుకు కారణమైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనపై ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైద్య వ్యవస్థ దుస్థితిపై నీతిష్​ సర్కార్​ను ప్రశ్నిస్తున్నాయి.