V6 News

BSPతో కలిసి పోటీ చేస్తా: పవన్‌

BSPతో కలిసి పోటీ చేస్తా: పవన్‌

రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ(BSP)నూ కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో వెళ్లిన పవన్‌.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. తర్వాత పవన్‌ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్  ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని తెలిపారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని.. దేశానికి దళిత నేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి వెళ్తామని ఇదివరకే పవన్‌ ప్రకటించారు. తాజాగా BSPతో నూ కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్టు తెలిపారు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు దాదాపు ఫైనల్ అయినట్లు తెలిపారు మాయావతి.